విద్యుత్‌ బస్సులను ప్రభుత్వమే నడపాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ బస్సులను ప్రభుత్వమే నడపాలి

Jul 17 2026 12:23 AM | Updated on Jul 17 2026 12:23 AM

ఎమ్మెల్సీని కోరిన

ఆర్టీసీ యూనియన్‌ నాయకులు

నెల్లూరు(పొగతోట): ఆర్టీసీలో విద్యుత్‌ బస్సులను ప్రభుత్వమే నేరుగా నడపాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. ఆ మేరకు గురువారం నగరంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ, పార్టీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బస్సుల సేవలను ప్రైవేట్‌కు అప్పగించడం వల్ల ఉద్యోగ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఆర్టీసీ బస్సుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే ప్రయాణికుల సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితి ఆర్టీసీ మనుగడకే ప్రమాదకరమన్నారు. ఉద్యోగుల ఆకాంక్షలను చట్టసభల ద్వారా ప్రభుత్వానికి తెలియజేసి ఆర్టీసీ భవితవ్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు బాబుశామ్యూల్‌, కృష్ణారావు, మురళీమోహన్‌రెడ్డి, కట్టా సుబ్రహ్మణ్యం, నారాయణరావు, మాల్యాద్రి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement