రొట్టెలు వదిలే ప్రాంతంలో కుప్పగా పోసి ఉన్న గుర్రపుడెక్క
కంటితుడుపు పనులతో నీటిపై తేలియాడుతున్న గుర్రపు డెక్క
దర్గా ప్రాంగణంలో కూలేందుకు సిద్ధంగా ఉన్న టూరిజం ప్రహరీ
కుక్కల విడిదిగా మారిన జిల్లా పర్యాటక శాఖ కార్యాలయ ప్రాంగణం
దెబ్బతిన్న ట్రాక్
రొట్టెల పండగకు రోజులు సమీపిస్తున్న తరుణంలో అక్కడ సరైన ఏర్పాట్లు చేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. బారాషహీద్ దర్గా ప్రాంగణంలో ఉన్న ఏపీ టూరిజం భవనం వద్ద కూలేందుకు సిద్ధంగా ఉన్న ప్రహరీ, విరిగిన ర్యాంప్ వాకింగ్ ట్రాక్‌తో పాటు స్వర్ణాల చెరువులో గుర్రపుడెక్కను సైతం పూర్తిస్థాయిలో తొలగించకుండా వదిలేశారు. ఇప్పటికే భక్తులు వస్తున్న క్రమంలో రొట్టెలు వదిలే ప్రదేశంలో భారీగా గుర్రపుడెక్కను వదిలేసి ఉన్నారు. ఇప్పటికై నా జిల్లా అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


