ఆక్రమణదారులకు వత్తాసు
భూముల ధరలు భారీగా పెరిగిపోవడంతో ఆక్రమణలూ అదే స్థాయిలో జరుగుతున్నాయి. కబ్జాదారులకు రెవెన్యూ అధికారులు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. పేదలకు కేటాయించిన ల్యాండ్స్‌ను సైతం టీడీపీ నేతలు హస్తగతం చేసుకుంటున్నారు. ఏళ్ల తరబడి సాగు చేసుకుంటున్న వాటినీ కొల్లగొడుతున్నారు. ఒకవేళ అందు లోకి ఎవరైనా ప్రవేశించేందుకు యత్నిస్తే, దౌర్జన్యాలకు సైతం తెగబడుతున్నారు. ఆన్‌లైన్‌లో తమ పేర్లున్నాయి.. వీటి జోలికొస్తే సహించేదిలేదంటూ హెచ్చరికలను సైతం జారీ చేస్తున్నారు.


