దమ్ముంటే టచ్‌ చేసి చూడండి | - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే టచ్‌ చేసి చూడండి

May 29 2026 2:55 AM | Updated on May 29 2026 2:55 AM

జనసేన నేతలకు

మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సవాల్‌

కావలి: మార్ఫింగ్‌ ఆడియో రికార్డింగ్‌లను వాట్సాప్‌ గ్రూపుల్లో వ్యాప్తి చేయడంతో పాటు తన ఇంటిని ముట్టడిస్తామంటూ జనసేన నేతలు రెండు రోజులుగా హల్‌చల్‌ చేస్తున్నారని, దమ్ముంటే తనను టచ్‌ చేసి చూడండంటూ ఆ పార్టీ నేతలకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వీరి తీరుపై కావలి డీఎస్పీ రమణకుమార్‌కు గురువారం ఫిర్యాదు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. జనసేనకు చెందిన చోటా నేతలు ఉద్దేశపూర్వకంగా ఫేక్‌ ఆడియోలను సృష్టించి తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై పోలీసులకు తమ పార్టీ నేతలు ఫిర్యాదు చేసినా, ఎలాంటి చర్యలు చేపట్టలేదని తెలిపారు. అసత్య ప్రచా రాలకు పాల్పడుతున్న వారి పేర్లతో సహా డీఎస్పీకి అందజేసినా చర్యలు చేపట్టకపోవడమేమిటని ప్రశ్నించారు. తన ఇంటిని ముట్టడిస్తామంటూ ఆ పార్టీ నేత లు పిలుపునివ్వడం విడ్డూరంగా ఉందని, ఇలాంటి వాటికి తాను భయపడేదిలేదని తేల్చిచెప్పారు. ప్రజల ఆశీస్సులతో తాను ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలుపొందానని, వారు తన వెంటే ఉన్నారన్నారు. దమ్ము.. ధైర్యముంటే తేదీ, సమయాన్ని ప్రకటించాలని.. ఎక్కడ్నుంచి వస్తారో రండి.. కార్యకర్తలతో కలిసి తానొస్తానని తెలిపారు. తాను చిరంజీవి, పవన్‌ కల్యాణ్‌ను దూషించానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని, అలా కాని పక్షంలో మీరేమి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. ఇలాంటి ఫేక్‌ ఆడియో రికార్డింగ్‌లను రూపొందించి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేసే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. జనసేనలోని కొందరు నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ నోటికి ఏదొస్తే ఆది మాట్లాడుతున్నారని, అదుపులో ఉండాలని హితవు పలికారు. అసత్య ప్రచారాలు చేస్తూ.. రాజకీయంగా లబ్ధి పొందాలని చూసే కుహా నా నేతలకు తగిన బుద్ధి చెప్తానని స్పష్టం చేశారు. ఎన్నికలెప్పుడొచ్చినా టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పార్టీ పట్టణాధ్యక్షుడు శివకుమార్‌రెడ్డి, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ వెంకటనారాయణ, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు కామరాజు, జిల్లా కార్యదర్శి ప్రసన్నాంజనేయులు, ప్రసాద్‌రెడ్డి, శ్రీనివాసులు, రాఘవులు, బీసీ భవన్‌ అధ్యక్షుడు వెంకటరావు, రాజశేఖర్‌, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement