రెండేళ్లుగా వేసవి సెలవుల్లో అందరం వేళాంగణి మాతను దర్శించుకుంటున్నాం. ఈ ఏడాది పది కుటుంబాలం బస్సులో బయలుదేరాం. గురువారం తెల్లవారుజామున అందరం నిద్రమత్తులో ఉండగా ఒక్కసారిగా పెద్దశబ్దం వచ్చింది. ఏం జరిగిందోనని నిద్రమత్తు నుంచి తేరుకుని చూడగా బస్సు బోల్తా పడి ఉంది. ఒకరిపై ఒకరు పడి ఉన్నారు. వెంటనే యువకులు, అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు బస్సు అద్దాలను పగులగొట్టి మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. మాలోని వారికి స్వల్పగాయాలయ్యాయి. పెనుప్రమాదం తప్పింది. వేళాంగణిమాతే మమ్మల్ని రక్షించింది. అమ్మ దయవల్లే మేమందరం సురక్షితంగా ఉన్నాం. – మేరీలత


