నెల్లూరు(అర్బన్): సైదాపురం మండలంలోని కొమ్మిపాడు గ్రామంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా శుక్రవారం పల్లె వీక్షణ కార్యక్రమాన్ని చేపట్టనున్నారని జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ డీడీ వేణుగోపాల్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన స్వయంగా పరిశీలిస్తారన్నారు.
నేడూ విద్యుత్ బిల్లులను చెల్లించొచ్చు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ బిల్లులను నేడు బక్రీద్ సెలవు రోజు అయినప్పటికీ చెల్లించవచ్చని ఎస్పీడీసీఎల్ జిల్లా సర్కిల్ ఎస్‌ఈ రాఘవేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలు గురువారం యథావిధిగా పనిచేస్తాయని, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


