నీళ్లు నిల్వ లేని చోట డీసిల్టేషన్‌కు టెండర్‌ | - | Sakshi
Sakshi News home page

నీళ్లు నిల్వ లేని చోట డీసిల్టేషన్‌కు టెండర్‌

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

ఎక్కడైనా బ్యారేజ్‌కు ఎగవ భాగంలో ఇసుక మేట వేస్తే అక్కడ మాత్రమే పూడిక తీత చేపట్టడాన్ని డీసిల్టేషన్‌ అంటారు. కానీ ఘనత వహించిన ఇరిగేషన్‌ అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ సంగం బ్యారేజ్‌ ఎగువ ప్రాంతంలో ఇసుక పూడిక తీత పేరుతో బ్యారేజ్‌కు 50 కి.మీ దూరంలో ఉన్న కలువాయి మండలం రాజుపాళెం వద్ద డీసిల్టేషన్‌కు అనుమతి ఇవ్వడం విస్మయానికి గురి చేస్తోంది. అదీ.. సోమశిల డ్యామ్‌కు కి.మీ. దూరంలో 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం ఎన్‌జీటీ నిబంధనలను తుంగలో తొక్కడమే అవుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీళ్లు నిల్వలేని చోట డీసిల్టేషన్‌ పేరుతో తమ్ముళ ఇసుక దోపిడీకి అనుమతి ఇవ్వమేనని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement