1.5 మెట్రిక్‌ టన్నులకే అనుమతి | - | Sakshi
Sakshi News home page

1.5 మెట్రిక్‌ టన్నులకే అనుమతి

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

అక్రమమో.. సక్రమమో పక్కన పెడితే.. కలువాయి మండల రాజుపాళెం వద్ద డీసిల్టేషన్‌ పేరుతో 1.5 మెట్రిక్‌ టన్నులకే ఇరిగేషన్‌ శాఖాధికారులు మిస్టర్‌ టీఎస్‌ఆర్‌ నిర్మన్‌ కంపెనీ పేరుతో అనుమతి ఇచ్చారు. అయితే ఇక్కడ జరుగుతున్న ఇసుక తవ్వకాలు లెక్కలు తీస్తే.. రోజుకు దాదాపు 150 టిప్పర్ల ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఒక్కో టిప్పర్‌కు 40 మెట్రిక్‌ టన్నులు ఇసుకను లోడ్‌ చేస్తున్నారు. ఈ లెక్కన రోజుకు సగటున 6 వేల మెట్రిక్‌ టన్నులు.. ఏడాదిగా ఇప్పటి వరకు 20.10 లక్షల మెట్రిక్‌ టన్నులు ఇసుకను లోడేశారు. ఏప్రిల్‌లో అండర్‌ ప్రాసెస్‌ ఉన్పప్పటికి భారీ యంత్రాలు పెట్టి నదీలోనే లోడింగ్‌ చేస్తున్నారు. ఏకంగా నదిలో పారే నీటికి అడ్డంగా పైప్‌లు వేసి పక్కాగా గ్రావెల్‌ రోడ్డును నిర్మించి రేయింబవళ్లు ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వానికి మెట్రిక్‌ టన్నుకు రూ.200 రాయల్టీ చెల్లించాల్సి ఉన్నా కానీ.. ఎక్కడా బిల్లింగ్‌ ఇవ్వకుండానే అక్రమంగా రవాణా చేస్తున్నారు. తక్కువ టన్నులు చూపించి దోపిడీ చేస్తున్నారు. మూడు నెలలుగా అండర్‌ ప్రాసెస్‌ ఉండడంతో అసలు ఇసుక తరలించలేదన్నట్లు రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement