కాకాణిని కలిసిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు | - | Sakshi
Sakshi News home page

కాకాణిని కలిసిన మాజీ ఎమ్మెల్యేలు, నేతలు

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

నెల్లూరు(వేదాయపాళెం): వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు తదితర అంశాలపై భవిష్యత్‌ కార్యాచరణ గురించి చర్చించారు. సమావేశంలో ఎమ్మెల్సీ, పార్టీ నగర నియోజకవర్గ ఇన్‌చార్జి పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్‌ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement