నగర శివారు ప్రాంతంలోని అంబాపురం సమీపంలో అంజనీమోడరన్ సిటీలో అనేక మంది ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకుని నివాసముంటున్నాం. అక్కడి ఓ ప్లాట్‌దారుడు మస్తాన్ నాయుడు చట్టానికి విరుద్ధంగా బోర్లు వేసి నీటిని రోజూ ట్యాంకర్లకు అమ్ముకుంటున్నాడు. ఫలితంగా చుట్టుపక్కల వారి ప్లాట్లలోని బోర్ వెల్స్‌లో నీరు అడుగంటి పోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. అతడిని ప్రశ్నిస్తే బూతులు తిడుతూ దౌర్జన్యం చేస్తున్నాడు. వాల్టా చట్టం ప్రకారం అనుమతులు తీసుకోకుండా నీటిని తోడి అమ్ముకుంటున్న వ్యక్తిపై చర్యలు చేపట్టాలి.
– మాధవి, రబేక, శ్రీకళ, విజయలక్ష్మి,
అంజనీ మోడరన్ సిటీ లేఅవుట్, నెల్లూరు


