మా చెల్లి నడవలేదయ్యా.. | - | Sakshi
Sakshi News home page

మా చెల్లి నడవలేదయ్యా..

May 26 2026 7:54 AM | Updated on May 26 2026 7:54 AM

ఈ చిత్రంలోని వ్యక్తి పేరు రామకృష్ణారెడ్డి. అల్లూరు మండలంలోని సింగపేట గ్రామ వాసి. తన చెల్లెలు శేషమ్మను ఎత్తుకుని కలెక్టరేట్‌కు వచ్చాడు. ఆమెకు 5వ సంవత్సరంలోనే పోలియో వచ్చి రెండు కాళ్లు చచ్చుబడ్డాయి. నడవలేదు. ఇప్పుడు వృద్ధాప్య దశ వస్తోంది. శేషమ్మకు అన్న తప్ప ఎవరూలేరు. గతంలో పింఛన్‌ వచ్చేది. అయితే ఆమె పేరు అన్న రేషన్‌కార్డులో ఉందని రద్దు చేశారు. రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా పునరుద్ధరించలేదు. ఏ దిక్కు లేని ఆమెకు ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ ఆసరాగా ఉంటుందని, అధికారులు చర్యలు తీసుకోవాలని రామకృష్ణారెడ్డి కోరాడు.

Advertisement
 
Advertisement
Advertisement