● ఉదయగిరి బ్రిడ్జిపై ఐరన్ గ్రిల్‌ను
ఢీకొట్టిన టిప్పర్ ● తప్పిన పెనుప్రమాదం
కావలి రూరల్: కూటమి ప్రభుత్వంలో కావలి మండలంలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. మద్దూరుపాడు, చెన్నాయపాళెం చెరువుల నుంచి రాత్రివేళల్లో అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి గురు రాఘవేంద్ర కంపెనీకి చెందిన టిప్పర్ అక్రమంగా మట్టిని తరలిస్తూ అతివేగంగా ప్రయాణిస్తూ కావలి పట్టణంలోని ఉదయగిరి బ్రిడ్జిపై ఐరన్ గ్రిల్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. లేకపోతే పెను ప్రమాదం చోటుచేసుకునేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పట్టణం మీదుగా అధిక లోడుతో వెళ్లే టిప్పర్ల ను నియంత్రించాలని, పట్టణంలోకి వాటి ప్రవేశాన్ని నిలిపివేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.


