● ముగ్గురికి గాయాలు
ఆత్మకూరు: వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ముగ్గురు వ్యక్తులు గాయపడిన ఈ ఘటన ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ముస్తాపురం వద్ద ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఎస్సై ఎస్‌కే జిలానీ కథనం మేరకు.. ముగ్గురు వ్యక్తులు వింజమూరు నుంచి ఏఎస్‌పేట మండలం గుడిపాడుకు కారులో బయలుదేరారు. ఏఎస్‌పేట రోడ్డులో ప్రయాణిస్తుండగా ముస్తాపురం సమీపంలో కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొని పల్టీలు కొట్టింది. ఇద్దరు తీవ్రంగా, మరొకరు స్వల్పంగా గాయపడ్డారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరుకు తరలించినట్లు ఎస్సై తెలిపారు. వారి పేర్లు, వివరాలు తెలియా ల్సి ఉందని, కేసు నమోదు చేశామన్నారు.


