ఆదివారం, సెలవు రోజుల్లోనూ సైతం మస్తర్ల నమోదు | - | Sakshi
Sakshi News home page

ఆదివారం, సెలవు రోజుల్లోనూ సైతం మస్తర్ల నమోదు

May 25 2026 12:17 AM | Updated on May 25 2026 12:17 AM

సహజంగా సోమవారం నుంచి శనివారం వరకు కూలీలు ఉపాధి పనులు చేసి ఆదివారం, సెలవు రోజుల్లో విశ్రాంతి తీసుకుంటారు. అయితే ఈ అక్రమార్కులు మాత్రం ఆదివారం సైతం పని జరిగినట్లు భారీగా నకిలీ కూలీల ముఖ హాజరు నమోదు చేసుకుని భారీ స్థాయిలో భోంచేస్తున్నట్లు తెలిసింది. ఉపాధి కార్యాలయంలో సిబ్బంది మధ్య వాటాల పంపకంలో తేడా రావడంతో అసలు విషయం కాస్త బయటకు పొక్కింది. చేజర్ల మండలంలో ఉపాధి హామీ పథకం ప్రారంభమైన తొలి సంవత్సరం (2006)లో నిధులు భారీగా భోంచేసి అందుకు బాధ్యులైన ప్రొబిషన్‌ డిక్లేర్‌ కానీ అప్పటి ఎంపీడీఓ పర్రె విజయశేఖర్‌, ఏపీఓ, ఇద్దరు సాంకేతిక సహాయకులు, పదుల సంఖ్యలో క్షేత్ర సహాయకులు సస్పెండ్‌ అయిన ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. కలెక్టర్‌ స్పందించి ఉపాధి హామీ పథకం పని తీరును పరిశీలించి కీలకమైన కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను దుర్వినియోగం చేస్తూ నిధుల గోల్‌మాల్‌కు కారణమవుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉపాధి కూలీలు మండల ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement