● వేర్వేరు ప్రమాదాల్లో
ముగ్గురి మృతి, ఒకరికి తీవ్రగాయాలు
మనుబోలు: ప్రమాదవశాత్తు రైల్లోంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల పరిధిలోని కొమ్మలపూడి–వెంకటాచలం రైల్వేస్టేషన్‌ల మధ్య శనివారం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు.. కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలో 153/21–23 కిలోమీటరు వద్ద ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహంపై ఉన్న గాయాలను బట్టి ప్రమాదవశాత్తు రైల్లోంచి పడిపోయి ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు లైట్ బ్లూకలర్ జీన్స్‌ఫ్యాంటు, నలుగు, బూడెద రంగు గళ్ల చొక్కా ధరించి ఉన్నారు. వయస్సు సుమారు 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. రైల్వే ఎస్సై హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


