ఆర్టీసీ–2 డిపో ప్రైవేటీకరణను నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ–2 డిపో ప్రైవేటీకరణను నిలిపివేయాలి

May 24 2026 1:51 AM | Updated on May 24 2026 1:51 AM

నెల్లూరు సిటీ: విద్యుత్‌ బస్సుల పేరుతో నగరంలోని ఆర్టీసీ–2 డిపో ప్రైవేటీకరణ పనులను వెంటనే నిలిపివేయాలని సీఐటీయూ నగర, రూరల్‌ కార్యదర్శి నాగేశ్వరరావు, నరసయ్య డిమాండ్‌ చేశారు. నగరంలోని ఆర్టీసీ–2 డిపో గ్యారేజీ వద్ద శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ–2 డిపోను ప్రైవేటు కాంట్రాక్టర్లకు ఇచ్చే చర్యలను ఆపాలన్నారు. 105 రోజుల నుంచి ఆర్టీసీ కార్మికులు పోరాటం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. దాదాపు రూ.300 కోట్ల ప్రజల ఆస్తిని విద్యుత్‌ బస్సులు పేరుతో ప్రైవేట్‌ కాంట్రాక్టర్లకు ఇవ్వడం దారుణమన్నారు. కార్యక్రమంలో నాయకులు కేవీ శివాజీ, పి.సూర్యనారాయణ, నజీర్‌, సురేష్‌, రాంబాబు, సుధాకర్‌, గిరి, మోహన్‌, ప్రసాద్‌, శ్రీను పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement