పట్టాలు దాటుతుండగా.. | - | Sakshi
Sakshi News home page

పట్టాలు దాటుతుండగా..

May 24 2026 1:51 AM | Updated on May 24 2026 1:51 AM

గూడ్స్‌ రైలు ఢీకొని వ్యక్తి మృతి

నెల్లూరు(క్రైమ్‌): రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్‌ రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో కావలివైపు వెళ్లే రైలు పట్టాలపై శనివారం జరిగింది. మృతుడు సుమారు 40 నుంచి 45 ఏళ్లు కలిగి టీషర్టు, బులుగు రంగు జీన్స్‌ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న రైల్వే ఎస్సై హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement