ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత | - | Sakshi
Sakshi News home page

ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రత

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

కలెక్టర్‌ హిమాన్షు శుక్లా

నెల్లూరురూరల్‌: స్వచ్ఛంద సంస్థలు, ప్రజల భాగస్వామ్యంతో పరిశుభ్రమైన వాతావరణం, పచ్చ దనం శోభిల్లుతోందని కలెక్టర్‌ హిమాన్షు శుక్లా అన్నారు. శనివారం ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో నిర్వహించిన ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొన్నారు. స్టేడియం పరిసరాలను చీపురు పట్టి శుభ్రం చేస్తూ అధికారులు, ప్రజాప్రతినిధులు పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో మే 22 నుంచి జూన్‌ 20 వరకు నాలుగు వారాల పాటు ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపా రు. ప్రతి వారం ప్రత్యేక అంశాలపై దృష్టి సారిస్తూ రెడ్‌, ఎల్లో స్పాట్ల తొలగింపు, ప్రధాన రహదారులు, కాలువలు, నాలాలు శుభ్రపరిచే పనులు, చెత్త వర్గీకరణ, ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత వంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్‌ సుజాత, కమిషనర్‌ నందన్‌, కోటంరెడ్డి గిరిధర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement