ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్లు | - | Sakshi
Sakshi News home page

ఇష్టారాజ్యంగా సర్టిఫికెట్లు

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

విద్యా సంస్థల బస్సులకు సంబంధించి ఇష్టారాజ్యంగా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. కండీషన్‌తో సంబంధం లేకుండా ఒక్కో బస్సుకు ఏడాదికి అయితే రూ.5 వేలు, రెండేళ్లు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీకి అయితే రూ.10 వేలు వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీంతో పాటు అక్కడ స్టేషనులో ఉన్న డ్రైవర్‌కు మరో రూ.500 సమర్పించుకోవాల్సి ఉంది. బస్సులకు సరైన కండీషన్‌ లేకున్నా డబ్బులు ఇస్తుండటంతో ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. చిన్న పిల్లలను రవాణా చేసే బస్సులు కండీషన్‌గా లేకుండా ఉంటే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. పిల్లల భద్రతపై తల్లిదండ్రులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement