డివిజన్లలో ఇదీ తీరు.. | - | Sakshi
Sakshi News home page

డివిజన్లలో ఇదీ తీరు..

May 1 2026 5:27 AM | Updated on May 1 2026 5:27 AM

ఆత్మకూరు డివిజన్లో 89.45.. కావలి డివిజన్లో 87.98.. నెల్లూరు డివిజన్లో 87.37 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఎయిడెడ్‌, మున్సిపల్‌ యాజమాన్య పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం మిగిలిన వాటితో పోలిస్తే తగ్గింది. ఎయిడెడ్‌లో 70.47.. మున్సిపల్‌ పాఠశాలల్లో 71.69 శాతం నమోదైంది. మున్సిపల్‌ స్కూళ్లను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతామని చెప్తున్న మంత్రి నారాయణ ఈ విషయంలో ఏ సమాధానం చెప్తారో వేచిచూడాల్సి ఉంది.

ఎయిడెడ్‌లో 500కుపైగా మార్కులు సాధించిన వారు 40.. ఏపీఎమ్మెస్‌లో 205.. ఏపీఆర్జేసీలో 91.. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌లో 148.. ఏపీటీడబ్ల్యూఆర్‌ఎస్‌లో 20 .. ప్రభుత్వ 87.. ప్రభుత్వ ఆశ్రమ్‌లో ఏడు.. కేజీబీవీలో 107, ఎంజేపీఏబీసీలో 28, మున్సిపల్‌లో 283, జెడ్పీలో 1593.. ప్రైవేట్‌లో 7581 మంది.. మొత్తం 10,190 మంది దక్కించుకున్నారు.

తగ్గిందిలా..

మేనేజ్‌మెంట్ల వారీగా..

500 మార్కులకుపైగా..

145 పాఠశాలల్లో ఆల్‌ పాస్‌

జిల్లాలోని 145 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత నమోదైంది. 116 ప్రైవేట్‌.. 24 జెడ్పీ.. మూడు కేబీబీవీ.. ప్రభుత్వ, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ స్కూళ్లు ఒకటి చొప్పున సాధించాయి.

రెండింట్లో సున్నా..!

మాగుంట లేఅవుట్లోని శ్రీకృష్ణ విబ్‌గ్యోర్‌.. నార్తురాజుపాళెంలోని హయగ్రీవ విద్యానికేతన్‌ పాఠశాలల్లో ఒక్కరూ పాస్‌ కాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement