ప్రతి చెమట చుక్కలో ఒక జీవితం దాగుతుంది. సూరీడు నిప్పులు కురిపిస్తున్నా.. వాన వెల్లువెత్తినా కుటుంబాలను పోషించడానికి కార్మికులు నిత్యం కష్టపడుతుంటారు. రోజువారీ వేతనాల కోసం బరువులు మోసేవారెందరో. నిశ్శబ్దంగా శ్రమిస్తూ సమాజాన్ని ముందుకు నడిపించే కార్మి కుల కృషిని గుర్తు చేసుకునే రోజే మేడే. వారి హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో సంస్థలు, సంఘాలు పనిచేస్తున్నా.. కష్టానికి తగిన ప్రతిఫలం అందడం లేదు. వేతనాల కోసం ఎన్నో చట్టాలు వచ్చినా ప్రయోజనం శూన్యం. మేడేను ఏటా నిర్వహిస్తున్నా, న్యాయం జరగడం లేదు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు


