15న జువ్వలదిన్నెకు వైఎస్‌ జగన్‌ రాక | - | Sakshi
Sakshi News home page

15న జువ్వలదిన్నెకు వైఎస్‌ జగన్‌ రాక

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

కావలి: మాజీ ము ఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 15న జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్‌ను సందర్శించేందుకు వస్తున్నట్లు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి బుధవారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మత్స్యకారుల అభ్యున్నతి కోసం రూ.289 కోట్లకు పైగా వెచ్చించి ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం హార్బర్‌కు సంబంధించిన స్థలాన్ని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడుకు చెందిన మెకనైజ్డ్‌ బోట్లు అక్రమంగా ఆంధ్రతీర ప్రాంతంలోకి చొచ్చుకొని రావడంతో మత్స్యకారులు ప్రాణాలకు తెగించి పట్టుకొని జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచితే అక్కడ కాపలా ఉండే వారిని బెదిరించి, ప్రలోభాలకు గురి చేసి బోట్లను విడిపించారన్నారు. వీటి విషయమై మత్స్యకారులకు భరోసా కల్పించేందుకు జగన్‌మోహన్‌రెడ్డి జువ్వలదిన్నెకు వస్తున్నట్లు తెలిపారు. మత్స్యకారులకు న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటామన్నారు.

తమిళనాడు

బోటు పట్టివేత

ముత్తుకూరు(పొదలకూరు): అక్రమంగా వేటకొచ్చిన తమిళనాడు ఫిషింగ్‌ బోటును పోర్టుకు ఆరు నాటికల్‌ మైళ్ల దూరంలో అధికారులు బుధవారం పట్టుకున్నారు. ఐఎన్డీ టీఎన్‌ – 02 ఎంఎం – 2001 నంబర్‌ గల ఈ పడవను తనిఖీ చేయగా, అందులో రూ.ఐదు లక్షల విలువైన మత్స్య సంపద లభ్యమైందని మత్స్యశాఖ ఏడీ చాంద్‌బాషా వెల్లడించారు. మత్స్యకారులు రవి, సురేష్‌, దుర్గ, హరిబాబు, పాలరాజు, కునదారి హిట్లర్‌, శ్రీరాములును అదుపులోకి తీసుకున్నారు. బోటుతో పాటు మత్స్యకారులను జువ్వలదిన్నె తరలించారు.

ప్రతిపాదనలను

సిద్ధం చేయండి

నెల్లూరు(పొగతోట): స్వయం సహాయక గ్రూపు మహిళలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ కార్యక్రమాల అమలుకు ప్రతిపాదనలను సిద్ధం చేయా లని డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి ఆదేశించారు. నగరంలోని డీఆర్డీఏ కార్యా లయం నుంచి వివిధ మండలాల ఏపీఎంలతో బుధవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. స్వయం సహాయక గ్రూపు మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలను ఏటా మంజూరు చేయించి వారి ఆర్థిక ప్రగతికి బాటలేస్తున్నామని వివరించారు. అర్హులైన గ్రూపు సభ్యులను గుర్తించాలని సూచించారు. బ్యాంక్‌ లింకేజ్‌, సీ్త్ర నిధి రుణాలకు అర్హత ఉన్న గ్రూపులు ఇతర వివరాలతో ప్రతిపాదనలను రూపొందించాలని కోరారు. రుణాల మంజూరు, శిక్షణ కార్యక్రమాలు తదితరాల్లో నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement