భార్యకు, చెల్లికి తేడా తెలియని నికృష్టుడు రాధాకృష్ణ | - | Sakshi
Sakshi News home page

భార్యకు, చెల్లికి తేడా తెలియని నికృష్టుడు రాధాకృష్ణ

Apr 9 2026 8:11 AM | Updated on Apr 9 2026 8:11 AM

చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తే.. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వావివరుసలు లేని, భార్యకు, చెల్లికి తేడా తెలియని నికృష్టుడని కాకాణి గోవర్ధన్‌రెడ్డి దుయ్యబట్టారు. రాధాకృష్ణ వ్యాఖ్యలకు నిరసన తెలియజేస్తుంటే, సీబీఎన్‌ అడ్డుపడుతున్నాడని, ఏబీఎన్‌ కార్యాలయం ముందు నిరసన అంటే పోలీసులు సీబీఎన్‌ కార్యాలయం ముందు నిరసన లాగా భావిస్తున్నారన్నారు. ఏబీఎన్‌కు, సీబీఎన్‌కు ఉన్న బంధం నేడు నిర్ధారణ అయిందన్నారు. సీబీఎన్‌ ఆదేశిస్తే ఏబీఎన్‌ రాధాకృష్ణ ఆచరించడం ఆనవాయితీగా తయారైందని, మహిళలపై అసభ్యకరమైన భాషలో కొత్త పలుకు పేరుతో చెత్త రాతలు, హేయమైన కారుకూతలతో ప్రసారం చేశారంటూ మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి మరొక్కసారి మాట్లాడితే రాధాకృష్ణ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. వ్యక్తిగతంగా మాపై ఎన్ని మాట్లాడిన పట్టించుకోమని, కుటుంబ సభ్యుల జోలికి వస్తే మాత్రం, విడిచి పెట్టమన్నారు. జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పిన మావిగన్‌ రాజధాని ప్రతిపాదన విషయంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ ప్రారంభమైందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మావిగన్‌ ప్రస్తావనతో చాలా మంది ఆకర్షితులవుతున్నారని, చంద్రబాబు కేవలం అమరావతిని బంగారు బాతు లాగా భావించి, తన ఆర్థిక స్వప్రయోజనాల కోసం పాకులాడుతున్నాడన్నారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని గురించి ఆలోచన చేస్తున్నది మా నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రమే అన్నారు. జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజల మద్దతు రోజురోజుకు మావిగన్‌ విషయంలో ఆదరణ పెరుగుతుందని ముందుగానే పసిగట్టిన రాధాకృష్ణ ముఠా వ్యక్తిగత హననానికి పూనుకుందన్నారు. రాధాకృష్ణ తన మనసులో ఉన్న బాధ, ఆవేదనను, మాటల రూపంలో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడితే, సంగతి తేలుస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement