జర్నలిజం ముసుగులో రాధాకృష్ణ రాసిన రాతలు ప్రజలు, మహిళా సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత మండిపడ్డారు. ఆ భాషను తిరిగి మాట్లాడాలంటే మహిళలే యావగించుకుంటున్నారన్నారు. ఇటువంటి జర్నలిజం బ్రోకర్, బూతు చానల్ రాధాకృష్ణ మహిళలను కించపరిస్తే పోలీసులు, ప్రభుత్వం వెనకేసుకు రావడానికి సిగ్గుండాలన్నారు. ప్రజల్లో మావిగన్ మీద చర్చ జరుగుతుంటే తెలిసే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఇంత నీచానికి దిగజారటం అవసరమా అన్నారు. రాధాకృష్ణకు మహిళలంటే గౌరవం లేదని, అందుకే పిచ్చి రాతలు, చెత్త పలుకులు పలుకుతున్నాడన్నారు. ఇప్పటికై నా మహిళలను గౌరవించి క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో మహిళలు తరిమి కొడతారన్నారు.


