● టీటీడీ చైర్మన్‌గా కొనసాగే అర్హత
బీఆర్ నాయుడికి లేదు
● వెంటనే రాజీనామా చేయాలి
● కాకాణి పూజిత
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పవిత్రమైన తిరుమల ప్రతిష్టను బీఆర్ నాయుడు దిగజార్చారని, టీటీడీ చైర్మన్‌గా కొనసాగే అర్హత ఆయనకు లేదని, తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మహిళా నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మంగళవారం ఆమె మాట్లాడారు. బీఆర్ నాయుడు సీ్త్రలోలుడంటూ చంద్రబాబుకు ఓ మహిళ స్వయంగా లేఖ రాశారని, ఇవన్నీ తెలిసినా ఆయన్ను టీటీడీ చైర్మన్‌ను చేశారని ఆరోపించారు. మహిళా భక్తులెళ్లి నిరసన తెలియజేస్తే, వారిపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కూటమి నేతలకు దేవుడంటే భయం, భక్తీ లేవన్నారు. బీఆర్ నాయుడి టీవీ చానల్‌లో చంద్రబాబుకు భజన చేస్తారని, అందుకే పదవి నుంచి తొలగించలేదని విమర్శించారు. జగనన్నపై తప్పుడు ప్రచారం చేస్తారనే ఆయన్ను వెనుకేసుకొస్తున్నారన్నారు. ఆయన్ను భువనేశ్వరి సైతం సమర్థించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని చెప్పారు.
భారతమ్మపై అనుచిత వ్యాఖ్యలు హేయం
రాజకీయాల్లో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడటం, విమర్శించడం పరిపాటి అని.. అయితే దీనికి భిన్నంగా కూటమి నేతలు మాట్లాడటం దారుణమన్నారు. ఏ రోజూ ఎవరి గురించి మాట్లాడని భారతిరెడ్డిపై నోటికొచ్చినట్లు వారు మాట్లాడటం బాధాకరమని తెలిపారు. లోకేశ్, చంద్రబాబు నిద్రలేస్తే తమ తల్లిని అన్నారంటూ గింజుకుంటారని, ఇతరులకు తల్లులు ఉండరానని ప్రశ్నించారు. భారతమ్మపై నోరు పారేసుకుంటే చంద్రబాబు, లోకేశ్‌కు కనిపించడం లేదానని నిలదీశారు. వారి తరహాలో దిగజారి మాట్లాడటం తమకు చేతకాదని, సంస్కారం అడ్డొస్తోందని చెప్పారు. ఆమైపె ఇంకోసారి మాట్లాడితే ఊరుకునేదిలేదని, తగిన బుద్ధి చెప్తామని స్పష్టం చేశారు. పేదల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని గుర్తుచేశారు. భారతమ్మ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, ఆమైపె మాట్లాడే స్థాయి, అర్హత కూటమి నేతలకు లేదని చెప్పారు. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు.. ప్రజలను ఏమార్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని దుయ్యబట్టారు.
మాట్లాడుతున్న పూజిత


