మలుపు వద్ద అదుపుతప్పిన టిప్పర్‌ | - | Sakshi
Sakshi News home page

మలుపు వద్ద అదుపుతప్పిన టిప్పర్‌

Mar 22 2026 1:33 AM | Updated on Mar 22 2026 1:33 AM

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

సీతారామపురం: సీతారామపురం–పోరుమామిళ్ల ఘాట్‌రోడ్డు మార్గంలోని ఓ మలుపు వద్ద శనివారం టిప్పర్‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. వైఎస్సార్‌ కడప జిల్లా పోరుమామిళ్ల నుంచి నారాయణప్పపేట గ్రామ సమీపాన జరుగుతున్న భారతమాల జాతీయ రహదారి టన్నెల్‌ పనుల వద్దకు బయల్దేరిన టిప్పర్‌ ఘాట్‌రోడ్డు మార్గంలోని రెండో మలుపు వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ప్రొటెక్షన్‌ వాల్‌తో పాటు డివైడర్‌ను ఢీకొని ఆగింది. డివైడర్‌ లేకుండా ఉండి ఉంటే టిప్పర్‌ లోయలో పడిపోయేది. ఈ ఘటనతో డ్రైవర్‌, క్లీనర్‌ భయభ్రాంతులకు గురై ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. జాతీయ రహదారి నిర్మాణ పనులు చేస్తున్న యంత్రాల సహాయంతో టిప్పర్‌ను వెనుక్కు లాగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement