వైఎస్ జగన్ హయాంలోనే అభివృద్ధి
● మాజీ మంత్రి కాకాణి
ముత్తుకూరు(పొదలకూరు) : గత వైఎస్ జగన్‌హన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, కూటమి ప్రభుత్వంలో అవినీతి పెచ్చురిల్లినట్టుగా మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కృష్ణపట్నం, బ్రహ్మదేవం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. బ్రహ్మదేవంలో కన్నయ్య, సుబ్బమ్మ కు టుంబాలు, కృష్ణపట్నంలో అంకయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేసి క్రమం తప్పకుండా పథకాలను ప్రజలకు అందించామని గుర్తుచేశారు. మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీ, ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులను ప్రారంభించామని వెల్లడించారు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చెప్పుకునే పని ఒక్కటైనా చేసిందా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి అవినీతి, దోపిడీతో కాలం వెళ్లబుచ్చుతున్నాడని పేర్కొన్నారు. మోంథా తుపానుతో దెబ్బతిన్న కాలువలు, చెరువుల మరమ్మతుల కోసం 316 పనులకు రూ.19.70 కోట్లు మంజూరు చేయించుకుని పనులు చేపట్టకుండా దోచుకునేందుకు పెద్ద స్కెచ్ వేశారని ఆరోపించారు. పర్సెంటేజీలు ఇవ్వలేదని సిద్ధేశ్వరాలయం పనులను నిలిపివేయించాడని, అవినీతి సంపాదనే ధ్యేయంగా ఆయన ముందుకు వెళుతున్నాడని విమర్శించారు. పోలీసులు వైఎస్సార్‌సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేస్తూ పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన పని లేదని, పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు.


