కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్‌ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతి నెలా ఒక్కో విధంగా రకరకాల మార్గాల్లో వాటిని అక్రమ రవాణా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇప్పటి వరకు చౌకదుకాణాల డీలర్ల నుంచి బియ్యాన్ని సేకరిస్తుండగా, ప్రస్తుతం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్‌ మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రతి నెలా ఒక్కో విధంగా రకరకాల మార్గాల్లో వాటిని అక్రమ రవాణా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. ఇప్పటి వరకు చౌకదుకాణాల డీలర్ల నుంచి బియ్యాన్ని సేకరిస్తుండగా, ప్రస్తుతం ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుం

Dec 20 2025 9:12 AM | Updated on Dec 20 2025 9:12 AM

కూటమి

కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్‌ మాఫియాకు అడ్డూ అదుపు లేకుం

నెల్లూరు(పొగతోట): జిల్లాలో పది ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. వాటిలో డిప్యూటీ తహసీల్దార్లను నియమించి స్టాక్‌ను పర్యవేక్షించాలి. కానీ కూటమి ప్రభుత్వం డిప్యూటీ తహసీల్దార్లను నియమించకుండా కాలయాపన చేస్తోంది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో జరిగే రేషన్‌ దందాకు డీటీలు అడ్డుపడుతారనే లేక మరేదైనా కావొచ్చు. కానీ సగం ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులనే ఇన్‌చార్జిలుగా నియమించారు. అత్యంత కీలకమైన, ఽఅధిక చౌకదుకాణాలు ఉండే నెల్లూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు సైతం మహిళను ఇన్‌చార్జిగా నియమించారు. డీటీని నియమించమని సివిల్‌ సప్లయీస్‌ సంస్థ డీఎం అనేక పర్యాయాలు ఫైల్‌ పెట్టినా ఫలితంలేదు. స్టాక్‌ పాయింట్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ సైతం లోపించడంతో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు చేతివాటం చూపుతున్నారు. రేషన్‌ మాఫియాతో కుమ్మకై ్క స్టాక్‌ పాయింట్‌ నుంచే నేరుగా సరుకులను మాయం చేస్తున్నారు.

రూ.కోట్ల విలువైన సరుకులు మాయం

జిల్లా వ్యాప్తంగా ఉన్న పది ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి సుమారు నాలుగు వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం నేరుగా రైస్‌ మిల్లులకు చేరుతున్నట్లుగా సమాచారం. చౌకదుకాణాల నుంచి అక్రమ రవాణా చేసే బియ్యం ప్లాస్టిక్‌ గోతాల్లో ఉంటాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి వచ్చే బియ్యం గన్నీ బ్యాగుల్లో ఉంటాయి. ఇటీవల అధికారులు పట్టుకున్న వాహనాల్లో బియ్యం గన్నీ బ్యాగులతోనే ఉన్నాయి. ఇటీవల ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాళెం స్టాక్‌ పాయింట్లలో రూ.కోట్ల విలువైన సరుకులు మాయం కావడమే అందుకు నిదర్శనం. ఉదయగిరి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో నాలుగు వేల బస్తాల బియ్యంతో పాటు చక్కెర, కందిపప్పు, తదితర సరుకులు మాయమయ్యాయి. ఉన్నతాధికారుల ఫిర్యాదుతో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో కూడా బియ్యం బస్తాల లెక్కల్లో తేడాలు వచ్చాయి. అఽధికారులు మాత్రం బియ్యం బస్తాలు పాయింట్‌లోనే ఉన్నాయి..ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదని చెబుతున్నారు. లోగుట్టు పెరుమాళ్ల కెరుక అన్నట్లుగా ఉంది అధికారుల పనితీరు. నెల్లూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో నలుగురు ప్రైవేట్‌ వ్యక్తులు దందా చేస్తున్నారు. ఏ షాపుకు ఎన్ని బియ్యం బస్తాలు సరఫరా చేయాలి.. ఏ సమయంలో రైస్‌మిల్లుకు తరలించాలనే విషయాలు ప్రైవేట్‌ వ్యక్తుల కనుసన్నల్లో జరుగుతున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో ప్రైవేట్‌ వాహనాలు సైతం దర్శనమిస్తున్నాయి. ఉచిత బియ్యం అనే ఫ్లెక్సీ ఉంటే ఎవరూ ఆపరని వాహనాలకు వాటిని తగిలించి తరలిస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్లల్లో సీసీ కెమెరాలు లేక పోవడం.. అధికార పార్టీ నేతల అండదండలు మెండుగా ఉండడంతో బియ్యం అక్రమ రవాణా మూడు లారీలు ఆరు బస్తాలుగా సాగుతోంది. జిల్లాలోని పది ఎంఎల్‌ఎస్‌ పాయింట్లల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిపితే మాయమైన బియ్యం బస్తాల విషయం వెలుగులోకి వస్తుంది.

రేషన్‌ మాఫియా కొత్త పంథా

జిల్లాలో 1513 చౌకదుకాణాలు ఉన్నాయి. 7.20 లక్షల రేషన్‌ కార్డులు ఉన్నాయి. ప్రతి నెలా 11 నుంచి 12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం కార్డుదారులకు చౌకదుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా బఫర్‌ గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు బియ్యం బస్తాలను సరఫరా చేస్తారు. జిల్లాలో 10 ఎంఎల్‌ఎస్‌ పాయింట్లు ఉన్నాయి. ప్రతి నెలా బ్యాక్‌ లాగ్‌ పరిశీలించి ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి చౌకదుకాణాలకు బియ్యాన్ని సరఫరా చేస్తారు. ఒక్కో చౌకదుకాణానికి నెలకు 10 టన్నుల వరకు బియ్యం సరఫరా చేయాల్సి ఉంటుంది. గత నెల లబ్ధిదారులకు పంపిణీ చేయగా మిగిలిన బియ్యాన్ని పరిశీలించి దానికి అనుగుణంగా బస్తాలు సరఫరా చేస్తారు. ప్రస్తుతం పోర్టబులిటీ వలన ఒకటి రెండు మినహా అన్ని చౌకదుకాణాల్లో వంద శాతం బియ్యం పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 26 నుంచి 31వ తేదీ వరకు దివ్యాంగులు, వృద్ధులకు వారి ఇళ్ల వద్దకు డీలర్లు వెళ్లి బియ్యం పంపిణీ చేయాల్సి ఉంది. దీనిని అడ్డు పెట్టుకుని డీలర్లు 1వ తేదీలోపే 40 నుంచి 50 శాతం మంది కార్డుదారులకు బియ్యాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెలా 4, 5 తేదీల్లోనే నో స్టాక్‌ బోర్డులు పెడుతున్నారు. లబ్ధిదారులు వెళ్లినా బియ్యం అయిపోయాయి. వచ్చే నెల రండి ఇస్తామని సమాధానం చెబుతున్నారు. బోగస్‌ కార్డులకు సంబంధించిన బియ్యం బస్తాలు ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నేరుగా రైస్‌మిల్లులకు చేరుతున్నాయి.

ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచే గోల్‌మాల్‌

రూ.కోట్ల విలువైన సరుకులు పక్కదారి

గోదాముల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే ఇన్‌చార్జ్‌లు

రేషన్‌ మాఫియాతో కుమ్మకై ్క సరుకులు మాయం

తవ్వేకొద్దీ వెలుగుచూస్తున్న అక్రమాలు

విచారించి చర్యలు

ఉదయగిరి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం బస్తాల స్టాక్‌ తేడాపై విచారణ చేపడుతున్నాం. విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. బుచ్చిరెడ్డిపాళెం ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో బియ్యం బస్తాలు ఉన్నాయి. వచ్చిన బియ్యం బస్తాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. అక్కడ ఎటువంటి పొరపాటు జరగలేదు. జిల్లాలో నలుగురు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఇన్‌చార్జులుగా ఉన్నారు. ప్రస్తుతం వారిని తొలగించి డిప్యూటీ తహసీల్దార్లను నియమించాం.

–అర్జున్‌రావు, డీఎం, సివిల్‌సప్లయీస్‌

కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్‌ మాఫియాకు అడ్డూ అదుపు లేకుం1
1/2

కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్‌ మాఫియాకు అడ్డూ అదుపు లేకుం

కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్‌ మాఫియాకు అడ్డూ అదుపు లేకుం2
2/2

కూటమి ప్రభుత్వ పాలనలో రేషన్‌ మాఫియాకు అడ్డూ అదుపు లేకుం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement