రూ.10 కోట్లతో పల్లె రూపు రేఖలు మారాయి
ఐదేళ్ల వైఎస్ జగన్ పాలనలో ఆ పల్లె ఐదు దశాబ్దాల భవిష్యత్‌ను అభివృద్ధిని సాధించింది. జిల్లా కేంద్రానికి మారుమూల మండలం సీతారామపురంలోని బసినేనిపల్లిలో రూ.10 కోట్ల మేర అభివృద్ధి పనులు జరగడంతో గ్రామ రూపురేఖలు మారాయి. అంతకు ముందు శిథిలావస్థలో ఉండే పంచాయతీ భవనం మాత్రమే ఉండేది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో సచివాలయం, ఆర్బీకే, విలేజ్ హెల్త్ క్లినిక్‌లు ఒకే సముదాయంలో ఏర్పాటు అయ్యాయి. రూ.70 లక్షలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆధునికీకరించి అన్నీ సౌకర్యాలు కల్పించారు. రూ.4 కోట్లు వ్యయంతో సిమెంట్ రోడ్లు, జల్‌జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించారు. రూ.30 లక్షల వ్యయంతో ధాన్యం నిల్వ కేంద్రం నిర్మించారు. ఆ ఐదేళ్లల్లో పల్లె రూపురేఖలు మారాయని సర్పంచ్ పల్లె విజయమ్మ చెప్పింది.


