జగనన్న పాలనలో సంపన్నుడయ్యాను..
నా పేరు దోకి కొండయ్య. కొడవలూరు మండలం రేగడిచెలిక గ్రామానికి చెందిన నేను ఐదెకరాల చిన్న రైతును. జగనన్న పాలనలో వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతోనే రూ.25 లక్షలకుపైగా అప్పులు తీర్చుకుని, మరికొంత పొలం, ఆస్తి కొనుగోలు చేయగలిగాను. జగనన్న అధికారంలో ఉంటేనే రైతులు బాగుపడుతారు. ఆయన మా రైతుల కోసం వెయ్యేళ్లు వర్ధిల్లాలి. గత ప్రభుత్వంలో ధాన్యం ధరలు 20 ఏళ్ల తర్వాత ఉండేంతగా ఉంటే.. టీడీపీ ప్రభుత్వంలో 20 ఏళ్ల క్రితం ధరలకు పడిపోయాయి. నాకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పంట దిగుబడి ద్వారా రూ.42 లక్షల రాబడి వస్తే.. అదే సేద్యంపై ఇప్పుడు రూ.24.50 లక్షలు మాత్రమే వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు క్రమక్రమంగా తిరిగి అప్పుల్లో కూరుకుపోయే పరిస్థితి ఏర్పడింది.


