జగనన్న చేసిన మేలు జీవితంలో మరిచిపోలేము..
పేద కుటుంబం కావడంతోపాటు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ కుటుంబానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ద్వారా రూ.5.30 లక్షలు లబ్ధి చేకూర్చారని ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల గ్రామానికి చెందిన రావూరు శ్రీనివాసులురెడ్డి తెలిపారు. నా కుమార్తె రమ్యకు బీటెక్‌లో చేరిన తొలి సంవత్సరంలో వినికిడి లోపం కారణంగా మానసికంగా కుంగిపోయింది. దీంతో మా ఆస్తులు తాకట్టు పెట్టి దాదాపు రూ.20 లక్షలు పెట్టి శస్త్ర చికిత్స చేయించాము. ఒక్క వినికిడి మెషిన్‌కు రూ.17.70 లక్షలు అయింది. అప్పటి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫార్సు చేస్తే రూ. 5.30 లక్షలు తమ కుటుంబానికి భరోసాగా నిలిచారు. అప్పుల పాలైన మాకు ఈ సాయం జీవితంలో మరిచిపోలేనిది.


