కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్న ఫీల్
నా పేరు జి. తనీష్‌సూర్య. మా తండ్రి సుకు మార్, తల్లి సుజాత ఇద్దరూ ప్రభుత్వ టీచర్లే. నేను నెల్లూరు నగరంలోని కేఎన్నార్ మున్సిపల్ పాఠశాలలో 6వ తరగతి నుంచి చదువుతున్నాను. ఇప్పుడు 10వ తరగతి. గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారంటే చాలా చులకన భావన ఉండేది. జగన్ మామయ్య సీఎం అయిన తరువాత నేను చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో నాడు–నేడుతో కార్పొరేట్ స్కూల్‌కు మించిన వసతులు కల్పించారు. గ్రీన్‌చాక్‌బోర్డుతోపాటు ఇంగ్లిష్ మీడియంలో బోధన, డిజిటల్ బోధన, టోఫెల్ విధానాన్ని ప్రారంభిచారు. 8వ తరగతిలో ఉండగా మాకు ట్యాబ్‌లు కూడా అందజేశారు. మా స్కూల్లోకి అడుగు పెడితే కార్పొరేట్ పాఠశాలలో చదువుతున్నామన్న ఫీల్ ఉండేది. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుల కుమారుడిగా మున్సిపల్ స్కూల్‌లో చదువుతున్నానని గర్వంగా చెప్పుకునే పరిస్థితి జగన్ మామయ్య వల్లనే వచ్చింది.


