హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు
నెల్లూరు (లీగల్): ఏపీ హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కే సురేష్‌రెడ్డిని నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో న్యాయశాఖ ఉద్యోగుల సంఘం జిల్లా నేతలు శనివారం మర్యాద పూర్వకంగా కలిశారు. పలు అంశాలపై ఆయనకు వినతిపత్రాన్ని అందజేశారు. వీలైనంత త్వరగా ఆయా సమస్యలు పరిష్కరిస్తానని వారికి జస్టిస్ సురేష్‌రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లా జడ్జి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా న్యాయశాఖలో ఉన్న 141 మంది ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేశామని, వారందరికీ కొత్త రిక్రూట్‌మెంట్ కంటే ముందే పదోన్నతి కల్పిస్తానని తెలియజేశారు. జిల్లా అధ్యక్షుడు పీవీ నారాయణ రెడ్డి, కార్యదర్శి వెంకట సునీల్, ఉపాధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్వర్లు, పోలయ్య తదితరలు పాల్గొన్నారు.
ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం
వాకర్స్‌కు అవార్డులు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్‌కు బెస్ట్ సర్వీస్ క్లబ్, హయ్యెస్ట్ మెడికల్, బెస్ట్ ప్రోగ్రాం అవార్డులు దక్కాయి. విశాఖపట్నంలోని ‘వుడా’ కన్వెన్షన్ హాల్‌లో శనివారం ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల పరిధిలోని ఒడిశా వాకర్స్ అసోసియేషన్ 34వ వార్షిక కన్వెన్షన్ జరిగింది. ఈ మూడు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన సేవ కార్యక్రమాలకు సంబంధించి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్‌కు లభించిన అవార్డులను ఆ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాబోలు సత్యం, స్నేహ సురేష్ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ప్రభావతి ద్వారా అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురామ్‌ముదిరాజ్, వేలూరు రంగారావు, అనంత రామారావు, బాలసుబ్బారెడ్డి, మెంటా రామారావు, పత్తి సుధాకర్, తిరుపతి శేఖర్, ప్రసాద్, పలగాటి శ్రీనివాసులురెడ్డి, నలుబోలు బలరామయ్యనాయుడు, ఏకొల్లు రాఘవరెడ్డి, ఏవీపీ తదితరులు పాల్గొన్నారు.
న్యాయం కోసం
పని చేయండి
● హైకోర్టు జడ్జి జస్టిస్ సురేష్ రెడ్డి
నెల్లూరు (లీగల్): న్యాయమూర్తులు న్యాయం కోసం పని చేయాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి, జిల్లా న్యాయ పాలన వ్యవహారాల జడ్జి జస్టిస్ కె.సురేష్ రెడ్డి సూచించారు. నెల్లూరులో జిల్లా స్థాయిలో న్యాయమూర్తుల ఒక రోజు శిక్షణ శనివారం జరిగింది. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి జస్టిస్ సురేష్ రెడ్డి మాట్లాడారు. అంతకు ముందు జస్టిస్ సురేష్‌రెడ్డి జిల్లా కోర్టుకు విచ్చేయగా జిల్లా జడ్జి శ్రీనివాస్, కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ అజిత, కార్పొరేషన్ కమిషనర్ నందన్ పుష్ప గుచ్ఛాలు, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలి కారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జస్టిస్ సురేష్‌రెడ్డి దంపతులు మొక్కను నాటారు. జిల్లా జడ్జి శ్రీనివాస్, న్యాయమూర్తులు, న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె వాణి, ఏపీ బార్ కౌన్సిల్ సభ్యులు వేనాటి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అయ్యపరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు
హైకోర్టు జడ్జిని కలిసిన న్యాయశాఖ ఉద్యోగులు


