ఉద్యోగుల గ్రీవెన్స్‌కు 64 అర్జీలు
నెల్లూరు(దర్గామిట్ట): నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యోగుల గ్రీవెన్స్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని 64 మంది ఉద్యోగస్తులు వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను కలెక్టర్, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ కుమార్‌కు అందజేశారు. వాటిని ఆయా శాఖల అధికారులకు అందజేసి సత్వరమే పరిష్కరించాల్సిందిగా సూచించారు.
జాబ్ చార్ట్, పే స్లిప్ అందించాలి
ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల, హాస్పిటల్లో మూడున్నర సంవత్సరాలుగా వివిధ కేడర్లలో విధులు నిర్వహిస్తున్నాం. అయితే వేరే పనులకు వినియోగిస్తున్నారు. మాకు జాబ్ చార్ట్, పే స్లిప్‌లు ఇచ్చేలా విధంగా చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఉద్యోగులు డీఆర్వోకు వినతిపత్రమిచ్చారు. కార్యక్రమంలో చెమూరు రవికుమార్, బి.రాజీవ్‌రెడ్డి, బి.వేణు, టి.రవి, నవీన్, వినయ్, వెంకటేష్, వెంకయ్య, ఖాదర్‌బీ, తంజమ్మ, స్వాతి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు.


