డెంగీ ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి
నెల్లూరు(అర్బన్): సీజనల్ వ్యాధులైన డెంగీ, మలేరియా ప్రబలకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా బయాలజిస్ట్ నాగార్జునరావు అన్నారు. నగరంలోని కపాడిపాళెం పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని రామిరెడ్డివారి వీధిలో ఫ్రైడే – డ్రైడే కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఇళ్లలోని తొట్టెలు, డ్రమ్ములు, బకెట్లలోని నీటిని పరిశీలించి దోమ లార్వాను ప్రజలకు చూపించారు. నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, వారానికి ఒక రోజు నీటి నిల్వ పాత్రలను కడిగి ఎండబెట్టాలని సూచించారు. దోమలు కుట్టడం ద్వారా వచ్చే డెంగీ, మలేరియా, బోధకాలు వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇళ్ల పరిసరాల్లో చెత్త, నీరు నిల్వ లేకుండా చూసుకోవడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యాఆరోగ్య శాఖ ఉద్యోగులు శ్యామ్‌సన్‌బాబు, రవి, ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.
సైదాపురంలో బంద్
సైదాపురం: మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జేఏసీ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మధ్యాహ్నం వరకు విద్యాసంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలు, దుకాణాలను మూసివేశారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు బంద్ కొనసాగింది. బస్టాండ్‌లో రాస్తారోకో, పురవీధుల్లో ర్యాలీ చేశారు. ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ మండల కన్వీనర్ డీపీ పోలయ్య, కో కన్వీనర్లు గంగాధర్, షఫీ, టీచర్లు యూనియన్ నేతలు జీవీ రత్నం, బి.ప్రసాద్, సోమయ్య, రమణయ్య పాల్గొన్నారు.
పెంచలకోనలో
గోదాదేవి క్షేత్రోత్సవం
రాపూరు: మండలంలోని పెంచలకోనలో శుక్రవారం గోదాదేవికి ప్రత్యేక పూజలు, క్షేత్రోత్సవం నిర్వహించారు. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని కోనలో గోదాదేవికి నాలుగు శుక్రవారాలు ప్రత్యేక పూజలు, క్షేత్రోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. అందులో భాగంగా మొదటి శుక్రవారం గోదాదేవిని తిరుచ్చిపై కొలువుదీర్చి పుష్పాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ కోన వీధుల్లో క్షేత్రోత్సవం జరిగింది.
అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా..
● వ్యక్తి అరెస్ట్
కందుకూరు రూరల్: కందుకూరు మండలంలోని మాచవరంలో అదే గ్రామానికి చెందిన ఎం.రవీంద్రబాబు అక్రమంగా మద్యం విక్రయిస్తుండగా శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఎకై ్సజ్ సీఐ ఎస్.శ్రీనివాసులు తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు రవీంద్రబాబు ఇంట్లో తనిఖీలు చేయగా 16 మద్యం బాటిళ్లు లభ్యమైనట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు.
డెంగీ ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి
డెంగీ ప్రబలకుండా జాగ్రత్తలు పాటించాలి


