జిల్లాను వీడని వర్షాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాను వీడని వర్షాలు

Dec 5 2025 6:51 AM | Updated on Dec 5 2025 6:51 AM

 జిల్

జిల్లాను వీడని వర్షాలు

సాక్షిప్రతినిధి, నెల్లూరు: దిత్వా తుఫాన్‌ జిల్లాలో బీభత్సాన్ని సృష్టించింది. చైన్నె సమీపంలోని మహాబలిపురం వద్ద తీరం దాటినా, దాని ప్రభావం జిల్లాపై తీవ్రంగా ఉంది. నాలుగు రోజులుగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గురువారం పడటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కోల్‌కతా – చైన్నె జాతీయ రహదారిపై మనుబోలు, వెంకటాచలం ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ఫలితంగా గంటల కొద్దీ ట్రాఫిక్‌ నిలిచిపోయింది. రోడ్లు ఛిద్రమయ్యాయి. చెరువులు, వాగులు, వంకలు, కాలువలు ఏకమయ్యాయి. పొంగిన వరద నీరు రోడ్డెక్కడంతో పలు చోట్ల గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి.

మునిగిన నారుమడులు

నాట్లకు సిద్ధంగా ఉన్న నారుమడులు.. వేసిన నాట్లు వే లాది ఎకరాల్లో మునిగిపోయాయి. పొలాలు చెరువుల ను తలపిస్తున్నాయి. చిరు వ్యాపారులు, వలస కార్మికులు, దినసరి కూలీలు పనుల్లేక పస్తులతో గడుపుతున్నారు. మగ్గం గుంతల్లోకి నీరు చేరడంతో చేనేత పనులు స్తంభించిపోయాయి. నగరంతో పాటు పలు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.

నగరంలో బీభత్సం

నగరంలో గురువారం మధ్యాహ్నం 12 నుంచి క్లౌడ్‌బరస్ట్‌ తరహాలో రెండు గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో రోడ్లపై మూడడుగుల మేర నీరు చేరింది. గాంధీబొమ్మ, పొగతోట, చిన్నబజార్‌, పెద్దబజార్‌, ఆచారివీధి, రాయాజీవీధి తదితర ప్రాంతాల్లో డ్రైనేజీ నీటితో కలిసి వర్షపు నీరు రోడ్లపై ప్రవహించింది. ఆత్మకూరు బస్టాండ్‌, మాగుంట లేఅవుట్‌, రామలింగాపురం అండర్‌ బ్రిడ్జిలు నిండిపోయాయి. మాగుంట లేఅవుట్‌ అండర్‌ బ్రిడ్జిలో ఓ కారు మునిగిపోయింది. విజయమహల్‌ గేట్‌ సమీపంలోని బాక్స్‌టైపు బ్రిడ్జి వద్దా ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో ఆయా ప్రాంతాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.

ఆదుకోవడంలో మంత్రులు విఫలం

మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులోనే ఉన్నారు. పేదలు, పూట గడవని అభాగ్యులు లోతట్టు ప్రాంతాల్లో పస్తులతో గడుపుతున్నా, వీరు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నగరంలోని మనుమసిద్ధినగర్‌లో డ్రైనేజీ కాలువలను వారం క్రితమే నిర్మిస్తే అవి కూలిపోయాయి.

7527.5 ఎకరాల్లో పంట నష్టం

జిల్లాలో ప్రస్తుతం కురిసిన వర్షాలకు సుమారు 6500 మంది రైతులు నష్టపోయారు. 6970 ఎకరాల్లో వరినార్లు, నాట్లు మునిగిపోయాయి. 557.5 ఎకరాల్లో శనగ పంట దెబ్బతినింది. మొత్తం 7527.5 ఎకరాల్లో పంట నష్టం సంభవించిందని వ్యవసాయాధికారులు ప్రకటించారు. మరోవైపు పది వేల మందికిపైగానే రైతులు నష్టపోయి ఉంటారని అంచనా. సుమారు 13 వేల ఎకరాల్లో నారుమడులు, నాట్లు మునిగిపోయాయని తెలుస్తోంది.

ఐదు రోజుల్లో భారీగా..

గత నెల 30 నుంచి గురువారం వరకు వెంకటాచలం మండలంలో 395.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సైదాపురంలో 351, పొదలకూరులో 340.4, మనుబోలులో 330.2, నెల్లూరు రూరల్‌లో 329.2, కోవూరులో 312.2, నెల్లూరు అర్బన్‌లో 300.8, ముత్తుకూరులో 282.6, కొడవలూరులో 273.2, రాపూరులో 248.6, బుచ్చిరెడ్డిపాళెంలో 244.2, విడవలూరులో 243, కలువాయిలో 228.6, ఆత్మకూరులో 217, తోటపల్లిగూడూరులో 210.8, ఇందుకూరుపేటలో 204.8, కావలిలో 201.8, సంగంలో 199.8, అనంతసాగరంలో 196.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

చెరువును తలపిస్తున్న తల్పగిరి కాలనీ

వర్షపాతమిలా..

ఉరుములు, మెరుపులతో వణికించిన వాన

జలదిగ్బంధంలో పలు ప్రాంతాలు

నెల్లూరులో నీటమునిగిన అండర్‌ బ్రిడ్జిలు

చెరువులను తలపిస్తున్న పొలాలు

ఆరు వేల ఎకరాల్లో నీటిలో

కుళ్లుతున్న నాట్లు, నారుమడులు

జిల్లాలో గురువారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం ఐదులోపు నెల్లూరు రూరల్‌లో అత్యధికంగా 88.8 మిల్లీమీటర్ల వర్షం పడింది. నెల్లూరు అర్బన్‌లో 83.4, కోవూరులో 67.2, ముత్తుకూరులో 62.4, పొదలకూరులో 45.8, కొండాపురంలో 43.4, సైదాపురంలో 42, కొడవలూరులో 39, విడవలూరులో 30.8, రాపూరులో 24.4, ఇందుకూరుపేటలో 20.4, తోటపల్లిగూడూరులో 17.6, కలువాయిలో 16.4, బుచ్చిరెడ్డిపాళెంలో 15.8, లింగసముద్రంలో 14.8, మనుబోలులో 12.6, చేజర్లలో 11.2, వెంకటాచలంలో 11, అల్లూరులో 7, సంగంలో 6.6, దగదర్తిలో 6.4, గుడ్లూరులో 4.4, ఉదయగిరిలో 4.2, అనంతసాగరంలో 3, ఆత్మకూరులో 2.8, మర్రిపాడులో 2.4, వలేటివారిపాళెంలో 2.4, వరికుంటపాడులో 2.2, సీతారామపురంలో 2, ఏఎస్‌పేటలో 1.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

 జిల్లాను వీడని వర్షాలు 
1
1/2

జిల్లాను వీడని వర్షాలు

 జిల్లాను వీడని వర్షాలు 
2
2/2

జిల్లాను వీడని వర్షాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement