ఉధృతంగా వాగులు | - | Sakshi
Sakshi News home page

ఉధృతంగా వాగులు

Dec 5 2025 6:51 AM | Updated on Dec 5 2025 6:51 AM

ఉధృతంగా వాగులు

ఉధృతంగా వాగులు

● జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వెంకటాచలం చెరువు నిండిపోయి నీరు జాతీయ రహదారిపైకి చేరింది. మండలంలో జెర్రిపోతు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

● మనుబోలు మండలం పిడూరు, బద్దెవోలు, కొలనకుదురు గ్రామాల్లోకి వాన నీరు చేరింది.

● పొదలకూరు మండలం ముడిగేడు – ఇనుకుర్తి మధ్య వాగు పొంగి రాకపోకలు స్తంభించాయి.

● చేజర్లలోని నల్లవాగు, నాపూరు పెద్ద వాగు ఉధృతంగా ప్రవిహిస్తున్నాయి.

● సైదాపురం మండలంలో పాలూరు – వేములచేడు మధ్య కుంటి కాలువ పొంగింది. కై వల్య నది ఉధృత రూపం దాల్చింది. బొగ్గేరు, బీరాపేరు, పైడేరు, మలిదేవి డ్రెయిన్లు ప్రవహిస్తున్నాయి.

● ఆత్మకూరు మండలంలోని వెన్నవాడ సమీపంలో ఉత్తర కాలువకు భారీ గండిపడింది. పొలాల్లోని నీరు కాలువ వద్దకు చేరడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.

● అనంతసాగరం సమీపంలోని ఓ కాలువకు వరద పెరగడంతో దళితవాడకు రాకపోకలు నిలిచిపోయాయి.

● రాపూరు మండలంలోని గోనుపల్లి బాడవ వాగు పొంగి ప్రవహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement