రైతన్నా మీ కోసం.. మరో మోసం | - | Sakshi
Sakshi News home page

రైతన్నా మీ కోసం.. మరో మోసం

Dec 5 2025 6:51 AM | Updated on Dec 5 2025 6:51 AM

రైతన్

రైతన్నా మీ కోసం.. మరో మోసం

ప్రశ్నిస్తారనే భయం

జిల్లాలో మొక్కుబడిగా నిర్వహణ

మద్దతు ధర లేక నష్టపోతున్న కర్షకులు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు

కొందరికే అన్నదాత సుఖీభవ

ప్రభుత్వానిదంతా ప్రచారార్భాటమే

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఎరువులు, విత్తనాలను అందించడంలో వారి వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాల క్రమంలో అన్నదాతలు ప్రశ్నిస్తారనే భయంతో ప్రజాప్రతినిధులు ముఖం చాటేస్తున్నారు. మరోవైపు సర్కార్‌పై అన్నదాతల్లో వ్యతిరేకత పెరగడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఈ కార్యక్రమానికి తెరలేపారనే వాదనా లేకపోలేదు.

ఆరుగాలం శ్రమించి పంటను పండించే అన్నదాతకు చేయూతనివ్వాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. రైతులను వంచిస్తూ వికటాట్టహాసం చేస్తున్న సర్కార్‌ వారిని మభ్యపెట్టేందుకు సరికొత్త డ్రామాకు తెరలేపింది. ‘రైతన్నా మీ కోసం’ అంటూ కార్యక్రమాలను మొక్కుబడిగా జరుపుతోంది. జిల్లాలోని 421 చోట్ల నిర్వహిస్తున్నా, వీటి వైపు ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడటంలేదు. ప్రచారార్భాటం కోసమే వీటిని ఏర్పాటు చేశారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ హయాంలో రైతులు సంతోషంగా ఉండేవారు. పుట్టి ధాన్యాన్ని రూ.25 వేల నుంచి రూ.28 వేల వరకు విక్రయించారు. పక్క జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి రైస్‌ మిల్లర్లు, వ్యాపారులను పిలిపించి ధాన్యాన్ని కొనుగోలు చేయించారు. దీంతో పోటీ పెరిగి మద్దతు ధరకు మించి లభించింది. అయితే ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహారం నడుస్తోంది.

నెల్లూరు(పొగతోట): అన్నదాత వెన్ను విరుస్తున్న టీడీపీ ప్రభుత్వం వారిని మభ్యపెట్టేందుకు ‘రైతన్నా మీ కోసం’ అనే బోగస్‌ కార్యక్రమానికి తెరలేపింది. జిల్లాలో 421 చోట్ల తూతూమంత్రంగా నిర్వహిస్తున్నారు. ప్రోగ్రామ్‌ జరుగుతున్న తీరును చూస్తే ఈ అంశం తేటతెల్లమవుతోంది. ప్రజాప్రతినిధులు కన్నెత్తి చూడకపోవడంతోనే వారికి కర్షకులపై ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో స్పష్టమవుతోంది.

ప్రయోజనమేదీ..?

ఉదాహరణకు కోవూరులో నిర్వహించిన రైతన్నా మీ కోసం కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. అన్నదాత సుఖీభవ డబ్బులు జమయ్యాయనే అంశమై మహిళా రైతును ప్రశ్నించగా, తనకు రాలేదని ఆమె సమాధానమిచ్చారు. ఎందుకు జమకాలేదంటూ అధికారులను ప్రశ్నించి, షో చేశారు. జిల్లాలో ఇద్దరు మంత్రులున్నా, ఎక్కడా హాజరుకాలేదు. అసలీ కార్యక్రమాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం చేకూరడంలేదు. అక్కడక్కడా ఎమ్మెల్యేలు వస్తూ తూతూమంత్రంగా జరుపుతున్నారు.

అన్నింట్లో అలసత్వమే

ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు కర్షకులు సిద్ధంగా ఉన్నారు. దీంతో వారిని కార్యక్రమాలకు దూరంగా ఉంచుతున్నారు. వాస్తవానికి గత సీజన్లో జిల్లాలో ఐదు లక్షలెకరాల్లో వరిని సాగు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని రైతులు, రైతు సంఘాల నేతలు విజ్ఞప్తి చేస్తూనే వచ్చారు. చివరికి 90 శాతం వరి కోతలు పూర్తయ్యాక మొక్కుబడిగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ తీరు కారణంగా పుట్టి ధాన్యానికి రూ.ఐదు వేల నుంచి రూ.ఆరు వేల వరకు అన్నదాతలు కోల్పోయారు. ఇలా జిల్లాలో సుమారు రూ.250 కోట్లకుపైగా నష్టపోయారు.

దళారులకు మాత్రం లాభాలు

రైతులు నిలువునా మోసపోతుండగా.. దళారులు, వ్యాపారులు మాత్రం లాభాలను ఆర్జిస్తున్నారు. టమాటోలు కిలోను రూపాయికి కర్షకుల నుంచి కొనుగోలు చేసి, నెల్లూరు మార్కెట్లో రూ.30కు విక్రయిస్తున్నారు. అరటి రైతులకు కిలో రూపాయి కన్నా తక్కువ లభిస్తోంది. మార్కెట్లో అరటి పండ్లను రూ.25 నుంచి రూ.30కు విక్రయిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా, రైతులకు చేసింది శూన్యం.

గత ప్రభుత్వ హయాంలో ఖుషీఖుషీ

రైతన్నా మీ కోసం.. మరో మోసం 1
1/1

రైతన్నా మీ కోసం.. మరో మోసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement