ప్రజాభీష్టం మేరకే కార్యాచరణ
● మాజీ ఎమ్మెల్యే ప్రసన్న
చిల్లకూరు: నెల్లూరు జిల్లాలో గూడూరును విలీనం చేసే విషయంపై ప్రజాభీష్టం మేరకు కార్యాచరణను ప్రకటిస్తామని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విష యంపై గూడూరులోని రెండో పట్టణంలోని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి నివాసంలో వైఎస్సార్‌సీపీ నాయకులతో సోమవారం ఆయ న చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సయయంలో గూడూరులో జరిగిన మహిళా సమావేశంలో చంద్రబాబు, యువగళం పాదయాత్రలో లోకేశ్ గూడూరును నెల్లూరులో విలీనం చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయితే నేడు తండ్రీతనయులు ఇద్దరూ హామీని నిలబెట్టుకోకుండా గూడూరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారని దుయ్యబట్టా రు. స్థానిక ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ సైతం గూడూరు విలీనంపై అసెంబ్లీలో గళమెత్తిన సమయంలో లోకేశ్ సానుకూలంగా స్పందించారని, ఇప్పు డు మాట మీద నిలబడకుండా గూడూ రు ప్రజలను వంచించారన్నారు. తాను గూడూరును నెల్లూరులో కలిపే విషయంపై ఒక నిర్ణయం ప్రకటించడం జరిగిందని, దీనిపై నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మేరిగ మురళీధర్, గూడూరులోని నాయకులతో చర్చిస్తామన్నారు. ఈ విషయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి గూ డూరు నియోజకవర్గ ప్రజల మనోభీష్టా న్ని తెలియజేసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని తెలిపారు. ఈ నెలఖారులోగా ప్రభుత్వం విడుదల చేసే గెజిట్‌లో గూడూరును నెల్లూరులో కలిపే విషయంపై తుది నిర్ణయం తీసుకోకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ గూడూరు పట్ట ణ,రూరల్, కోట మండలాల అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్‌రెడ్డి, పలగాటి సపంత్‌కుమార్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మెట్టా రాధాకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు నల్లపరెడ్డి రాజేంద్రకుమార్‌రెడ్డి, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ వీరి చలపతి పాల్గొన్నారు.


