మహిళా రైతులకు రుణాలివ్వండి
నెల్లూరు(పొగతోట): మహిళా రైతులకు రూ.లక్ష నుంచి రూ.రెండు లక్షల వరకు రుణాలను మంజూరు చేయాలని డీఆర్డీఏ నాగరాజకుమారి సూచించారు. యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏపీఎంలతో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బ్యాంక్ లింకేజీ, పీఎంఈజీపీ, పీఎమ్మెఫ్‌ఎంఈ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సూచించారు. యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ శ్యామ్‌ప్రసాద్, అగ్రి లోన్ చీఫ్ మేనేజర్ ఉదయ్, సీనియర్ మేనేజర్ రవితేజ, డీపీఎంలు మధుసూదన్, మురళి, రవికుమార్, దుర్గా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.


