గాయపడిన వ్యక్తి మృతి
కలిగిరి: కలిగిరి – కొండాపురం మార్గంలోని చిన్నచెరువు వద్ద ఈ నెల 17న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రైతు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. వివరాలు.. చిన్నఅన్నలూరు పంచాయతీ తొగురువారిపాళేనికి చెందిన నల్లపనేని చంద్రమోళి (63) ఆటోలో వెళ్తుండగా, కలిగిరికి వస్తున్న ట్రాక్టర్ గొర్రు తగలడంతో వాహనం బోల్తాపడింది. ఘటనలో చంద్రమోళి తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో నెల్లూరులో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్ వద్దకు తీసుకొచ్చి.. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై ఉమాశంకర్ మాట్లాడారు. ట్రాక్టర్ యజమానిపై చర్యలు చేపడతామని చెప్పారు. కాగా నష్టపరిహారాన్ని అందించేందుకు యజమాని అంగీకరించారు.
చికిత్స పొందుతూ వ్యక్తి..
ఆత్మకూరు: స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ సుమారు 55 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి బుధవారం మృతి చెందారు. తన పేరు సుధాకర్ అని మాత్రమే తెలియజేశారని సమాచారం. ఇతర వివరాలు తెలియరాలేదు. ఎరుపు రంగు టీ షర్ట్, సిమెంట్ రంగు ప్యాంట్‌ను ధరించి ఉన్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని తరలించారు. వివరాలు తెలిసిన వారు సీఐ గంగాధర్ (94407 96371), ఎస్సై జిలానీ (94407 96390) నంబర్లను సంప్రదించాలని కోరారు.
గాయపడిన వ్యక్తి మృతి


