అటల్ టింకరింగ్ ల్యాబ్‌లతో ఉపయోగం
నెల్లూరు (టౌన్): ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పేద విద్యార్థులను శాస్త్ర, సాంకేతిక రంగాల్లో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు అటల్ టింకరింగ్ ల్యాబ్‌లు ఎంతో ఉపయోగపడతాయని డీఈఓ బాలాజీరావు పేర్కొన్నారు. దర్గామిట్టలోని జెడ్పీ హైస్కూల్లో ల్యాబ్ ఇన్‌చార్జీలు, హెడ్‌మాస్టర్లతో బుధవారం నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు నైపుణ్యాలను పాఠశాల స్థాయి నుంచే నేర్పాలని సూచించారు. సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఏఎంఓ సుధీర్‌బాబు, డీఎస్‌ఓ శివారెడ్డి, మెంటార్లు కల్యాణ్‌కుమార్, కార్తీక్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.


