టీబీ నివారణకు కృషి
నెల్లూరు(అర్బన్): టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా జిల్లాలో టీబీ నివారణకు వైద్య శాఖ అధికారులు కృషి చేయాలని ఏడీఎంహెచ్‌ఓ ఖాదర్‌వలీ పేర్కొన్నారు. టీబీ నివారణపై నగరంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో బుధవారం నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనికి గానూ జిల్లా వైద్యశాఖ, మెడికల్ కళాశాల, సర్వజన ఆస్పత్రి అధికారులు సంయుక్తంగా పనిచేయాలని సూచించారు. జిల్లాలో టీబీ కేసులు, వారికి అందజేస్తున్న మందులపై చర్చించారు. మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, పల్మనాలజీ హెచ్‌ఓడీ అరుణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ రేవతి తదితరులు పాల్గొన్నారు.
గుర్తుతెలియని
మృతదేహం లభ్యం
కోవూరు: పట్టణంలోని సత్రంవీధిలో గుర్తుతెలియని మృతదేహం బుధవారం లభ్యమైంది. వెంటనే పోలీసులకు స్థానికులు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని కోరారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సివిల్ సప్లయ్స్
గోదాములో తనిఖీలు
ఉదయగిరి: స్థానిక సివిల్ సప్లయ్స్ గోదాములో రికార్డులను పరిశీలించి, స్టాక్ వివరాలను విజయవాడ, నెల్లూరు నుంచి వచ్చిన ప్రత్యేక తనిఖీ బృందాలు బుధవారం నమోదు చేశాయి. తనిఖీలు ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు వరకు కొనసాగాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్‌కు సంబంధించిన స్టాక్, రికార్డుల్లో నమోదైన వివరాలను సరిచూశారు. దాదాపు 200 మెట్రిక్ టన్నుల బియ్యం స్వాహా అయిందని తేల్చారు. నవంబర్‌కు సంబంధించిన రికార్డులను పరిశీలించాల్సి ఉంది. మరో రెండు రోజుల పాటు తనిఖీలు జరిపిన అనంతరం పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నామని తెలిపారు.
విజేతలకు
బహుమతుల ప్రదానం
నెల్లూరు(దర్గామిట్ట): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల, నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీల్లో విజేతలకు బహుమతులను జేసీ వెంకటేశ్వర్లు అందజేశారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో డీఈఓ బాలాజీరావు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ముగ్గురు చిన్నారుల్లో ఒకర్ని మాక్ అసెంబ్లీకి ఎంపిక చేయగా, మిగిలిన వారికి ప్రశంసపత్రాలు, మెడళ్లను అందజేశారు.
ఉద్యోగోన్నతులకు కౌన్సెలింగ్
నెల్లూరు(వీఆర్సీసెంటర్): నగరంలోని గాంధీబొమ్మ సెంటర్‌లో గల జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో ఉద్యోగోన్నతులకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను బుధవారం నిర్వహించారు. అనంతరం అర్హులకు ఉద్యోగోన్నతులను కల్పించారు. డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, సీఈఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్‌కు అభినందన
నెల్లూరు(క్రైమ్): శ్రీనగర్‌లో ఈ ఏడాది అక్టోబర్‌లో జమ్మూ, కశ్మీర్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆలిండియా పోలీస్ జూడో క్లస్టర్ గేమ్స్‌లో పెన్‌కాక్ సిలాట్ విభాగంలో నెల్లూరు ఏఆర్ కానిస్టేబుల్ చరణ్‌తేజ స్వర్ణ పతకాన్ని సాధించారు. ఈ క్రమంలో ఆయన్ను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అజిత బుధవారం అభినందించారు.
టీబీ నివారణకు కృషి
టీబీ నివారణకు కృషి
టీబీ నివారణకు కృషి
టీబీ నివారణకు కృషి
టీబీ నివారణకు కృషి


