ఇదెలా సాధ్యమైందో..
ఆక్రమిత కోటమిట్ట ప్రాంతాన్ని పొలంగా తయారు చేసే క్రమంలో సాగునీటి కోసం మండలంలోని అప్పారావుపాళెం పెన్నానది ఒడ్డున ఫారెస్ట్ అధికారుల ఆధీనంలో ఉన్న ప్లాంటేషన్ స్థలంలో బోర్లు వేసి ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశారు. బోర్ల నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరం ఆర్‌అండ్‌బీ ఆధీనంలోని రోడ్డు పక్కనే పైపులైన్ ఏర్పాటు చేశారు. ఆక్రమిత స్థలాన్ని పొలాలుగా మార్చకముందే పక్కాగా పైపులైన్లు, సాగునీటి వసతి ఏర్పాటు చేశారంటే ఏ స్థాయిలో ఈ తంతు జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాగా బోర్లకు విద్యుత్ అనుమతులు బట్టేపాడు గ్రామంలో తీసుకుని అప్పారావుపాళెం పెన్నానది ఒడ్డున ఏర్పాటు చేయడం విశేషం. విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వీటికి అనుమతి ఎలా ఇచ్చారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.


