ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

ఆక్రమణల తొలగింపులో ఉద్రిక్తత

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

ఆత్మకూరు: పట్టణంలోని బీఎస్సార్‌ సెంటర్‌లో దర్గా ప్రహరీని ఆనుకొని నిర్మించిన గదుల నుంచి రోడ్డుపైకి వచ్చిన నిర్మాణాలను కమిషనర్‌ గంగాప్రసాద్‌ ఆధ్వర్యంలో మంగళవారం తొలగించారు. ఈ ప్రాంతంలోని బీఎస్సార్‌ విగ్రహం చుట్టూ ఉన్న కొన్ని ఆక్రమణలను మూడు రోజుల క్రితం తొలగించగా, కొందరు మంగళవారం వరకు అనుమతి కోరారు. వీటిని తొలగించేందుకు యత్నించడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. తాము వక్ఫ్‌బోర్డుకు అద్దె.. మున్సిపాల్టీకి పన్నును చెల్లిస్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మీరామొహిద్దీన్‌ పేర్కొన్నారు. ఎస్సై జిలానీ జోక్యం చేసుకొని టీపీఓ సహకారంతో ఆక్రమణలను జేసీబీతో కూల్చేశారు. తాను హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నా, ఇలా తొలగించడం అన్యాయమని మీరామొహిద్దీన్‌ వాపోయారు. త్వరలో ఈ ప్రాంతంలో రోడ్డు మరమ్మతులు చేయించి.. బీఎస్సార్‌ విగ్రహం చుట్టూ ఐల్యాండ్‌ను నిర్మించనున్నామని మున్సిపల్‌ సిబ్బంది తెలిపారు.

జేసీబీకి అడ్డుగా నిలిచిన మీరామొహిద్దీన్‌

ఆక్రమణల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement