ఖాకీల స్వామిభక్తి | - | Sakshi
Sakshi News home page

ఖాకీల స్వామిభక్తి

Apr 1 2026 8:12 AM | Updated on Apr 1 2026 8:12 AM

షాడో మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వాట్సాప్‌ స్టేటస్‌

విస్మయం కలిగించిన ఎస్సైల తీరు

చేజర్ల: ఓ షాడో మంత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని శుభాకాంక్షలు తెలుపుతూ తమ వాట్సాప్‌ స్టేటస్‌గా ఖాకీలు పెట్టుకోవడం తీవ్ర దుమారాన్ని రేపింది. సదరు నేత ఆశీస్సులు పొందేందుకు ఎస్సైలు ఈ రకంగా వ్యవహరించడం ఆత్మకూరు నియోజకవర్గంలో విస్మయం కలిగించింది.

ఆశీస్సుల కోసం తాపత్రయం

రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి షాడోగా ఆత్మకూరు నియోజకవర్గానికి చెందిన తాళ్లూరి గిరి వ్యవహరిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక, అమాత్యుడ్ని అడ్డం పెట్టుకొని అనేక అక్రమ వ్యాపారాలకు తెరలేపి సొమ్ము చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో ఏ అధికారి నియామకం జరగాలన్నా, ఈయన ఆశీస్సులు తప్పనిసరి. దీంతో అధికారులందరూ ప్రజాసేవ కంటే ఆయన సేవలోనే తరిస్తుంటారు. ఈ క్రమంలో తాళ్లూరి గిరి జన్మదినాన్ని మంగళవారం పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ చేజర్ల, సంగం ఎస్సైలు వారి అధికారిక మొబైల్‌ ఫోన్‌ వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నారు. దీన్ని చూసిన పలువురు మీడియా ప్రతినిధులు, ప్రముఖులు నివ్వెరబోయారు. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తుతూ.. నియోజకవర్గంలో ఇతర పార్టీల నేతలపై అక్రమ కేసులు బనాయిస్తూ సదరు పోలీస్‌ అధికారులు చెలరేగిపోతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చివరికి ఎస్సైల వ్యవహారం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేయడంతో వెంటనే వారు తొలగించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

గిరినాయుడికి జన్మదిన శుభాకాంక్షలు

తెలుపుతూ పెట్టిన వాట్సాప్‌ స్టేటస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement