
జర్నలిస్టు సంఘాల నిరసన
మనుబోలు: ‘సాక్షి’ మీడియాపై పోలీసుల వేధింపులు అప్రజాస్వామికమని జర్నలిస్టు సంఘం నేత బాబూ మోహన్‌దాస్ అన్నారు. ఎడిటర్ ధనుంజయరెడ్డి, బ్యూరో ఇన్‌చార్జిలను కేసుల పేరుతో వేధించడాన్ని నిరసిస్తూ శనివారం మనుబోలు రెవెన్యూ కార్యాలయంలో ఆర్‌ఐ అరుణ్‌తేజ్‌కు మీడియా ప్రతినిధులు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ తమకు గిట్టని వార్తలు రాసే జర్నలిస్టులను పోలీసులు కేసుల పేరుతో వేధించడం దుర్మార్గమన్నారు. జర్నలిస్టులు స్వేచ్ఛగా తమ విధులను నిర్వర్తించుకునే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జర్నలిస్టులపై తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులు రవీంద్ర బాషా, శ్రీనివాసులు, జగదీష్, జయకర్, సుధాకర్, శంకర్, సునీల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.