
జర్నలిస్టులను వేధించడం తగదు
సమాజంలో జరుగుతున్న విషయాలను ప్రజలకు చేరవేడం జర్నలిస్టుల విధి. మూడో మైలు దగ్గర మద్యం షాపు వద్ద ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషయంపై స్థానికుల సమాచారం మేరకు ‘సాక్షి’ బ్యూరో మస్తాన్‌రెడ్డి వార్తను రాశారు. దీనిపై కక్ష కట్టిన ప్రభుత్వం అక్రమ కేసులతో అర్ధరాత్రి నోటీసులతో భయపెడుతూ వేధించడం తగదు.
– జయరాజు, జర్నలిస్టు సంఘాల జేఏసీ
పత్రికల గొంతు నొక్కకండి
జర్నలిస్టులకు పార్టీలను ఆపాదించడం సరికాదు. ఏ పార్టీ అయినా రాజకీయంగానే పోరాడాలే తప్ప జర్నలిస్టులపై కక్ష సాధించడం, పత్రికల గొంతు నొక్కడం ప్రజాస్వామ్య హితం కాదు. ఏదైనా అభ్యంతరకరమైన వార్త ప్రచురితమైతే వివరణ కోరాలే కానీ, ‘సాక్షి’ ఎడిటర్, బ్యూరో చీఫ్, రిపోర్టర్లపై కేసులు పెట్టి పోలీసుల ద్వారా నోటీసులు ఇచ్చి విచారణ పేరుతో బెదిరించడం దుర్మార్గం – పర్రి బాలకృష్ణ, జర్నలిస్టు సంఘాల జేఏసీ

జర్నలిస్టులను వేధించడం తగదు

జర్నలిస్టులను వేధించడం తగదు