
లక్కీడిప్.. గందరగోళం
నెల్లూరు సిటీ: బాణసంచా దుకాణాల కేటాయింపునకు సంబంధించిన లక్కీడిప్ ఈ ఏడాది గందరగోళంగా మారింది. ప్రక్రియను నెల్లూరు ఆర్డీఓ కార్యాలయంలో శుక్రవారం రాత్రి నిర్వహించారు. అయితే ఇందులో తమకు అన్యాయం జరిగిందంటూ అధికారులపై కొందరు లైసెన్స్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి లైసెన్స్‌దారులకు నచ్చజెప్పి ప్రక్రియను పూర్తి చేశారు. వీఆర్సీ గ్రౌండ్స్‌లో 41.. వైఎమ్సీఏ గ్రౌండ్స్‌లో 36.. చిల్డ్రన్స్‌పార్క్ సమీపంలో 25.. గోషాస్పత్రి ప్రాంతంలో 11.. ఆరెస్సార్‌లో 27, బీవీఎస్ గర్ల్స్ హైస్కూల్ వద్ద ఒక దుకాణానికి అనుమతిచ్చారు.
ఈసారి కుదింపు
వాస్తవానికి వీఆర్సీ గ్రౌండ్స్‌లో ఏటా 60 నుంచి 65 దుకాణాలకు అనుమతులిచ్చేవారు. అయితే ఈ ఏడాది ఓ ప్రైవేట్ కార్యక్రమాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో స్టేజ్ ఏర్పాటును ప్రారంభించారు. దీంతో అక్కడ 41 దుకాణాలకే అనుమతులను మంజూరు చేశారు. దీనిపై లైసెన్స్‌దారులు మండిపడ్డారు. ఎన్నో ఏళ్లుగా ఇక్కడే ఏర్పాటు చేసుకుంటున్నామని, ఇప్పుడు మరోచోట పెట్టుకోవాలని అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 42వ నంబర్ నుంచి వచ్చే దుకాణాలను ఇతర చోట్ల ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
మ్యాప్‌లో పొరపాటు
వీఆర్సీ గ్రౌండ్స్‌లో 41వ దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు స్థలం లేకపోవడంతో లైసెన్స్‌దారుడు మండిపడ్డారు. తానెక్కడ పెట్టాలని ప్రశ్నించారు. ఫైరింజిన్ ప్రవేశానికి వీఆర్సీ కళాశాల నుంచి దారిని ఏర్పాటు చేయడంతో ఈ మార్పు జరిగింది. చివరికి ఓ దుకాణాన్ని కుదించి దీని ఏర్పాటుకు వీలు కల్పించారు. మరోవైపు భారీ వర్షాలతో ఇక్కడి మైదానం చిత్తడిగా మారడం ఇబ్బందిగా పరిణమించింది.
బాణసంచా దుకాణాల కేటాయింపునకు ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహణ
ఏటా 60కు అనుమతి..
ఈసారి మాత్రం 41
అధికారులను ప్రశ్నించిన లైసెన్స్‌దారులు

లక్కీడిప్.. గందరగోళం

లక్కీడిప్.. గందరగోళం