
సోమశిలకు 24,833 క్యూసెక్కుల వరద
సోమశిల: జలాశయానికి వరద జలాలు పెరిగినట్లు ప్రాజెక్ట్ ఈఈ శ్రీనివాసులు ఆదివారం తెలిపారు. పైతట్టు ప్రాంతంలోని ఆదినిమ్మాయపల్లి రెగ్యులేటర్ నుంచి 24,833 క్యూసెక్కుల వరద జలాలు జలాశయానికి చేరుతున్నాయన్నారు. ఈ వరద జలాలను జలాశయంలో నిల్వ ఉంచకుండా దిగువ కు విడుదల చేస్తామన్నారు. పెన్నానదీ పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం జలాశయం నుంచి పెన్నానదికి 2,650, కండలేరుకు 6000, ఉత్తర కాలువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. జలాశయంలో 72.87 టీఎంసీలు ఉన్నాయి.